telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘అల్లుడు అదుర్స్’ షూటింగ్ లో పాల్గొంటున్న బెల్లంకొండ శ్రీనివాస్

Bellamkonda

“అల్లుడు శీను” సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. “కవచం” వరకు అదే పంథాలో నడిచిన ఈ హీరో “సీత” సినిమాతో రూట్ మార్చాడు. భిన్నమైన కథలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తమిళంలో విడుదలైన “రాక్షసన్”ను తెలుగు రీమేక్ “రాక్షసుడు”లో హీరోగా నటించారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా నటించారు. ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కు మంచి విజయాన్ని అందించింది. కాగా ఇప్పుడు ఈ హీరో తన ఎనిమిదో సినిమా చేస్తున్నారు. సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరక్కబోతున్నది. ఈ సినిమా కోసం శ్రీనివాస్ తన బాడీని పూర్తిగా మార్చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైంది. ఈ షడ్యూల్ లో ప్రకాష్ రాజ్ , హీరో పైన కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. 2021 సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ కి ఈ సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో బెల్లాకొండ శ్రీనివాస్ సరసన నభా నటేష్ – అనూ ఇమాన్యుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ – సోనూసూద్ – వెన్నెల కిషోర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గొర్రెల సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Related posts