telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాజ్యాంగ వ్యవస్థలపై బండి సంజయ్ అవగాహన పెంచుకోవాలి….

Balka suman trs

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్‌ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, రాష్ట్ర ప్రాజెక్టుల పై ప్రధాని, కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలిశారని బాల్క సుమన్‌ తెలిపారు. రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు అనేకం ఉంటాయని.. వాటిలో భాగంగానే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళారన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం చేశారని ప్రశ్నిస్తున్న బండి సంజయ్ కు ఢిల్లీ లో ఏం జరిగిందో తెలియదా.. ఎంపీ గా ఉన్న వ్యక్తి కి కేంద్ర, రాష్ట్ర సంబంధాలు తెలియవా..అవగాహన లేదా ? అని ప్రశ్నించారు. బండి సంజయ్ అడిగాడని కాదు… రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కాబట్టి చెప్తున్నామన్నారు. ఎన్నో రకాల పదవుల్లో ఉన్న వ్యక్తి కేసీఆర్.. ఆయన గురించి మాట్లాడే ముందు ఆచీ తూచి మాట్లాడాలని హెచ్చరించారు. స్థాయి లేని వాళ్ళు అంతా.. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడేవారేనని.. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్లుగా బండి సంజయ్ ఎగిరెగిరి పడుతున్నాడని ఫైర్‌ అయ్యారు. మా పార్టీ నాయకత్వం, కేసీఆర్ గురించి మాట్లాడే ముందు అవగహన పెంచుకొని మాట్లాడాలని.. రాజ్యాంగ బద్ద వ్యవస్థలపై బండి సంజయ్ అవగాహన పెంచుకోవాలని సూచించారు. బండి సంజయ్ తన పద్దతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెపుతారని.. పీఎంతో సీఎంలు కలవడం సాధారణ విషయమని తెలిపారు బాల్క సుమన్‌.

Related posts