telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇప్పటికీ నెం.1 స్థానంలో “బాహుబలి”

bahubali

భారతదేశం గర్వించదగ్గ చిత్రం “బాహుబ‌లి-2”. రాజమౌళి దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, రానా, సత్యరాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. “బాహుబ‌లి” చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 1800 కోట్ల వ‌సూళ్ళని రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల‌ని ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ చిత్రం విడుద‌లై మూడేళ్ళు అవుతున్న‌ప్ప‌టికీ, ఆ మేనియా కొన‌సాగుతూనే ఉంది. ఈ చిత్రాలు కేవలం ఒక్క తెలుగులోనే కాకుండా మొత్తం భారతదేశ అన్ని భాషల్లోనూ ఆల్ టైం రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించింది. అయితే ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందుకోవడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం బాలీవుడ్ జనం అని కూడా చెప్పాలి. తాజాగా మరోసారి అది ప్రూవ్ అయ్యింది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ మొదలు పెట్టినప్పటికీ కూడా అక్కడ బాహుబలి 2 సినిమా డామినేషన్ మామూలు రేంజ్ లో లేదు. గత సెప్టెంబర్ నాలుగో వారపు స్లాట్ లో టెలికాస్ట్ చేసిన బాహుబలి 2 కు భారీ స్థాయిలో దాదాపు 55 లక్షల వ్యూవర్ షిప్స్ తో హిందీలో టాప్ 5 ప్రోగ్రామ్స్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇది ఈసారి మాత్రమే కాదు అక్కడ టెలికాస్ట్ చేసిన ప్రతీ సారి రిపీట్ అవుతుండడం విశేషం.

Related posts