telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పాతిక కోట్ల విరాళంతో గొప్ప మనసు చాటుకున్న అక్షయ్ కుమార్

akshay

కరోనా మహమ్మారి బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పీఎం కేర్స్ ఫండ్‌కి రూ.25 కోట్ల విరాళాన్ని అందించారు. ఇప్పటి వరకు బాలీవుడ్ నటీనటులలో ఇంత భారీగా విరాళం ప్రకటించిన వారు లేరు. తాజాగా అక్షయ్ ప్రకటించిన విరాళంతో.. బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ‘‘ప్రస్తుతం మన ప్ర‌జ‌ల జీవితాల‌ని కాపాడుకోవ‌ల‌సిన స‌మ‌యం ఇది. ఎటువంటి సంఘటనకైనా స్పందించాలి.. మ‌న‌కి తోచినంత సాయం చేయాలని అందరినీ కోరుతున్నాను. నా విధిగా పీఎం కేర్స్ ఫండ్‌కి రూ.25 కోట్ల విరాళాన్ని అందిస్తున్నాను. ప్రాణం ఉంటే ప్రపంచం ఉన్నట్లే.. మనల్ని మనం రక్షించుకుందాం’’.. అని అక్షయ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి ప్రధాని మోదీ.. అక్షయ్‌ని అభినందిస్తూ.. ‘‘గొప్ప మనసు చాటుకున్నారు..’’ అని ట్వీట్ చేశారు.

Related posts