telugu navyamedia
వార్తలు విద్యా వార్తలు సామాజిక

మీకు పచ్చబొట్టు ఉందా.. అయితే ఆర్మీ ఉద్యోగానికి అనర్హులు!

Indian Man arrested with pak sim card

వేలాది మంది నిరుద్యోగ యువకులు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల కోసం విద్యాసంస్థల్లో శిక్షణ పొందుతుంటారు. అంతేగాకుండా ఫిజికల్ కోచింగ్ తీసుకొని అన్నివిధాల ఉద్యోగం కోసం కృషి చేస్తునారు. ఆర్మీలో ప్రవేశ అర్హతల పట్ల అవగాహన లేకపోవడం వల్ల చాలామంది నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ ఆండ్ నాలెడ్జ్ (టాస్క్) కీలక ముందడుగు వేసింది. వారికి టాస్క్ సీఈవో శ్రీకాంత్‌సిన్హా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సైన్యంలో ఉద్యోగావకాశం పొందేలా శిక్షణ ఇస్తున్నామని టాస్క్ సీఈవో తెలిపారు.

ఈ శిక్షణను వరంగల్, రామగుండం సెంటర్లలో వచ్చే నెలలో ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. నామమాత్రపు ఫీజుతో ఇస్తున్న ఈ శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, మెజార్టీ ఫీజును టాస్క్ భరిస్తున్నదన్నారు. ఈ పథకం ద్వారా గత ఏడాది 380 మంది శిక్షణ పొందినట్టు తెలిపారు. టాస్క్ శిక్షణకు సమన్వయకర్తగా ఉన్న బ్రిగేడియర్ (రిటైర్డ్) సీఎస్ శ్రీరాములు శిక్షణ గురించి వివరిస్తూ, టాటూ (పచ్చబొట్టు) కలిగి ఉంటే ఆర్మీ ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటిస్తారని తెలిపారు. ఈ విషయాలపై అవగాహన లేకపోవడం వల్ల చాలామంది అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు.

Related posts