ఆ మహా జ్యోతి
ఎన్నో కుటుంబాలకు వెలుగును నింపే
నిత్య అగ్నిహోత్ర మై
సమాజముపై చూపు ప్రసరించే…
సామాన్యుడి తలరాతను
తరతరాల బానిసత్వం నుంచి
బంగారు భవిత ప్రయాణానికి
విజ్ఞాన సారధిగా ముందుండి నడిపించే..
ప్రపంచ మేధావుల్లో
మొదటి వరసలో నిలిచి
ప్రపంచ దేశాలు తిరిగి
జ్ఞాన సముద్రాన్ని ఒడిసిపట్టే…
అతని నుదుటి భాగం చూస్తే
వేల గ్రంధాలు సారము
అతని మస్తిష్కంలో నిక్షిప్తం మై
విశ్వనరుడై జ్ఞాన భిక్ష పెట్టె..
బుద్ధుని బోధనలకు ఆకర్షితులై
శాంతి మార్గాన్నికే నిదర్శనమై
అభినవ బుద్ధుడిగా కీర్తి గాంచి
దేశమంతా ప్రజల కోసం నడయాడే…
అతను నడిచే గ్రంథాలయం
ప్రపంచ విజ్ఞాన సర్వస్వం
దీన బాంధవులకు ఆశాదీపంమై
భారత రాజ్యాంగం నిర్మించే..
యుగానికి ఒక పురుషుడు
ప్రతి యుగంలోనూ ఉద్యమిస్తే
దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో
తానే ముందుండి అక్షరాలా నిరూపించే…
నా ప్రకటనలను అతనే నియంత్రించాడు… “గురూజీ” అంటూ పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు