telugu navyamedia
సినిమా వార్తలు

అమ్మాయిని అమ్మాయి ముద్దు పెట్టుకుంటే తప్పేంటి ?… అమలాపాల్ బోల్డ్ కామెంట్స్

Amalapaul

రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం “ఆమె”. తమిళంలో “ఆడై” టైటిల్ తో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుండగా చరిత చిత్ర, తమ్మారెడ్డి భరద్వాజలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్లో నగ్నంగా కన్పించి అందరికీ షాకిచ్చింది అమలాపాల్. ఇక టీజర్ విషయానికొస్తే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ వీక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రముఖులు సైతం సినిమా టీజర్ పై ప్రశంసలు కురిపించారు. టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఇటీవలే ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో అమలాపాల్ మందు తాగుతూ, సిగరెట్ కాలుస్తూ లిప్ లాక్ చేస్తూ చాలా బోల్డ్ గా కనిపించింది. సినిమాల్లో లిప్ లాక్స్ కామనే అయినప్పటికీ అమలాపాల్ తన సహనటి వీజే రమ్యని ముద్దుపెట్టుకోవడం చర్చకు దారి తీసింది. ట్రైలర్ లో ఈ సన్నివేశాన్ని పట్టిపట్టి చూస్తే కాని కనిపించదు.

దాన్ని చూసిన వాళ్లంతా ఆ సినిమా లెస్బియన్, గే సినిమా కావచ్చేమోనని కూడా అనుకున్నారు. ఆ రూమర్లు ఆ నోటా.. ఈ నోటా.. పాకి అమలాపాల్ వరకు రావడంతో ముద్దు సీన్‌పై వివరణ ఇచ్చింది. ఇది లెస్బియన్ సబ్జెక్టు సినిమా కాదని, విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, రమ్యతో ముద్దు సీన్ ఎందుకు అని ప్రశ్నించగా.. ఒక అమ్మాయిని మరో అమ్మాయి ముద్దు పెట్టుకుంటే తప్పేంటని ఎదురు ప్రశ్నించింది. అది షాట్‌లో భాగమని, స్క్రిప్టులో కావాలని రాసిన సన్నివేశం కాదని తెలిపింది. సినిమాలో తమ ఇద్దరి మధ్య ఎలాంటి లైంగిక సంబంధం ఉండదని అమలా పాల్ తేల్చి చెప్పింది. సినిమా చూశాక అన్నీ అర్థం అవుతాయని చెబుతూనే, తాను స్క్రిప్టు డిమాండ్ చేయడం వల్లే నగ్నంగా నటించానని చెప్పిందీ భామ. కాగా ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తెలుగు, త‌మిళంలో ఈ సినిమాను జూలై 19న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related posts