telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కృష్ణంరాజు కుటుంబానికి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శ…

దివంగత సినీ నటుడు కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌ లతో కలిసి శుక్రవారం రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్‌లోని కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, వారి కుమార్తెలతో పాటు, హీరో ప్రభాస్‌ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌.. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అనంతరం షేక్‌పేట్‌ దర్గా సమీపంలోని జేఆర్సీ కన్వెన్షన్‌లో క్షత్రియ సేవా సమితి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న కృష్ణంరాజు సంస్మరణ సభలో ప్రసంగించారు

కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ వచ్చి తనను కలిశారని.. ఇంత త్వరగా ఈ లోకాన్ని వెళతారని నేను అనుకోలేదని రాజ్‌నాథ్ సింగ్ తన బాధ‌ను వ్యక్తం చేశారు.

కృష్ణంరాజుని తాను అన్నగారు అనే సంభోదించేవాడిని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. కృష్ణం రాజు దశదిన కర్మ రోజు వద్దామనుకున్నానని.. కానీ షెడ్యూల్ బీజీ కారణంగా ఈ రోజు వచ్చానని తెలిపారు.

గో హత్య నిషేధంపై పార్లమెంటులో మొట్టమొదట బిల్లు ప్రవేశపెట్టింది కృష్ణంరాజు గారేనని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. తర్వాత కాలంలో యోగి అదిత్యనాధ్ కూడా గోహత్య నిషేధ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టారని తెలిపారు.

ఈ సందర్భంగా బాహుబలి సినిమా గురించి కూడా రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను హోంమంత్రిగా ఉన్న సమయంలో కృష్ణంరాజు తన వద్దకు వచ్చారని, బాహుబలి సినిమా బాగా వచ్చిందని ఒకసారి చూడాలని కోరారని తెలిపారు. మా ఫ్యామిలీ, కృష్ణంరాజు ఫ్యామిలీ కలిసి బాహుబలి చూసామని రాజ్‌నాథ్ తెలిపారు. తమతో పాటు హోంశాఖలో పనిచేస్తున్న అందరు కూడా కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూశామని గుర్తుచేసుకున్నారు.

కృష్ణంరాజు ఎంత ఎదిగినా తన మూలాలు మరిచిపోలేదని…తన గ్రామంలో ప్రతి ఒక్కరి పేరు ఆయనకు గుర్తుండేదని రాజ్‌నాధ్ సింగ్ ప్రశంసించారు.

Related posts