telugu navyamedia
telugu cinema news trending

శుభశ్రీ లాగే మరొకరు బలి… మరో విషాదం

Anuradha

శుభశ్రీ స్కూటీపై వెళుతుండగా అన్నాడీఎంకే హోర్డింగ్ మీద పడటంతో అదుపు తప్పి కిందపడడం, ఆ వెనుకనే వస్తున్న ట్యాంకర్‌ లారీ ఆమెపై నుంచి వెళ్లడంతో శుభశ్రీ మృతి చెందిన ఘటన మరువక ముందే తాజాగా మరో విషాద ఘటన జరిగింది. అనురాధ(30) అనే మహిళ ఓ హోటల్‌లో అకౌంట్స్ సెక్షన్‌లో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటోంది. రోజూలానే స్కూటీపై అనురాధ ఉద్యోగానికి వెళుతుండగా కోయంబత్తూరులోని అవినాషి రోడ్‌లో రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన అన్నాడీఎంకే జెండా ఉన్నట్టుండి కింద పడింది. దీంతో.. దానిని తప్పించే ప్రయత్నంలో ఆమె అదుపు తప్పి కింద పడింది. వేగంగా వస్తున్న ఓ లారీ కింద పడిన ఆమె స్కూటీపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో అనురాధ కాళ్లు తీవ్రంగా దెబ్బ తిన్నట్లు వైద్యులు తెలిపారు. ఓ కాలి నరం పూర్తిగా తెగినట్లు వెల్లడించారు. శుభశ్రీ ఘటనతో మద్రాస్ హైకోర్టు చీవాట్లు పెట్టినప్పటికీ రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతల వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. పార్టీల జెండాలు, కటౌట్లతో రోడ్లను నింపేస్తున్నారు. ఈ ఘటనతో అనురాధ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

విక్రమ్ లాండింగ్ పై ప్రధాని .. ప్రతి అపజయం .. గొప్ప విజయానికి ఆరంభం ..

vimala p

సమ్మ‌ర్ స్పెష‌ల్‌గా “ఒరేయ్‌ బుజ్జిగా”

vimala p

స్టేజీపై హీరోతో హీరోయిన్ వెటకారం… కార్తీ కౌంటర్…

vimala p