బుల్లితెరపై అలీ హోస్ట్ చేస్తున్న ఓ షోకి యాంకర్లుగా బుల్లితెరపై దూసుకుపోతున్న శ్రీముఖి, యాంకర్ రవిని ఆయన ఆహ్వానించారు. అందులో ముఖ్యంగా లాస్య తర్వాత ‘పటాస్’ షో నిమిత్తం రవితో జత కలిసింది శ్రీముఖి. వీరిద్దరూ ఆ షోలో వ్యవహరించే తీరుతో అనేక అనుమానాలు చోటు చేసుకున్నాయి. అంతేకాదు ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ షోని టాప్‌లో నిలబెట్టిన విషయం తెలిసిందే. ఇక ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే విషయమే పెద్దగా హైలెట్ అయింది. మరి ఇదే ప్రశ్న వారిద్దరికీ అలీ సంధించారు. దీనికి స్పందించిన వారిద్దరూ ‘‘మా మధ్య వృత్తిగతంగా ఉన్న సంబంధమే తప్ప వ్యక్తిగతమైన సంబంధం ఏమీలేదు. సాధారణంగా ఒక ప్రోగ్రామ్ చేసేటపుడు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి ఒకరు చేతులను ఒకరు పట్టుకోవడం, దగ్గరకు తీసుకోవడం చేస్తుంటాం. అలాంటవన్ని సినిమాల్లో చూసిన ప్రేక్షకులు మా మధ్య ఏదో ఉందని అనుకుంటారు. నిజానికి మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. మేము కేవలం మంచి మిత్రులం మాత్రమే. మేము ఏమిటో మా ఫ్యామిలీలకి కూడా తెలుసు..’’ అని తెలిపారు.
previous post