telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జనగామ వెళ్లి మాట్లాడడం కాదు.. దమ్ముంటే దుబ్బాక బస్టాండుకు రా

BJP Bandi sanjay

సీఎం కెసిఆర్ పై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. మొన్న దుబ్బాకకు వచ్చినప్పుడు కేంద్రం ఇచ్చిన పైసలు.. అదీ ఓ నాలుగు పథకాలకు సంబంధించి లెక్కలు చెప్తే అవి తప్పని సీఎం కేసీఆర్ అన్నారని.. నేను చెప్పిన లెక్కలు తప్పయితే ఉరేసుకుంటా.. దమ్ముంటే చర్చకు రా అని సవాల్ విసిరితే సీఎం నుంచి స్పందన లేదని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతీ పైసా కేంద్రానిదే. రోడ్లు, పార్కులు, బాత్రూంలు, స్మషానాలు అన్నీ కేంద్రం ఇచ్చే పైసలతోనే నిర్మిస్తున్నారని… కాదంటున్న కేసీఆర్ ను చర్చకు రమ్మని సవాల్ విసిరితే తోకముడిచారని మండిపడ్డారు.పెన్షన్ల గురించి ముఖ్యమంత్రిది ఒక మాట.. మంత్రి ఇంకో మాట.. పెన్షన్లలో కేంద్రం 16 పైసలే ఇస్తుందని హరీష్ అంటుంటే.. 200 రూపాయలు ఇస్తుందని కేసీఆర్ అంటున్నారని… టీఆర్ఎస్ నాయకులు తప్పుడు మాటలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. పెన్షన్ల గురించి ఓ బిజెపి కార్యకర్త మాట్లాడిన మాటలకు సీఎం స్పందించారు. అంటే కేసీఆర్ ఏ స్థాయికి దిగజారారో అర్థమవుతుందని..ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్న వాటిలో కేంద్రం పైసలు ఎన్ని ఉన్నాయో.. రాష్ట్రం పైసలు ఎన్ని ఉన్నాయో చర్చకు నేను సిద్ధం.. చర్చకు వచ్చే దమ్ము కేసీఆర్ కు ఉందా..? ప్రశ్నించారు. నేను సవాల్ చేస్తున్నా.. 54 లక్షల టన్నుల బియ్యాన్ని మేం రూ.10వేల కోట్లు పెట్టి కొన్నాం.. తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని..స్వచ్ఛ భారత్ కింద కడుతున్న బాత్రూంలకు రూ.8వేలు ఇస్తున్నాం.. రైతు వేదికల నిర్మాణంలో రూ.260 కోట్లు ఇచ్చాం.. తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు. తెలంగాణ గ్రామాలకు, పట్టణాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు వందల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది.. కేసీఆర్ కు దమ్ముంటే తప్పని రుజువు చెయ్యాలన్నారు. ఎక్కడో జనగామ జిల్లాకు వెళ్లి మాట్లాడడం కాదు.. దమ్ముంటే దుబ్బాక బస్టాండుకు రా… తెలంగాణకు కేంద్రం ఎంతిచ్చిందో.. రాష్ట్రం ఎంత ఖర్చు పెట్టిందో.. ఇద్దరం కూర్చొని చర్చిద్దామని ఫైర్ అయ్యారు.

 

Related posts