telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని అమెరికాలో ఆందోళన!

lockdown america corona

ప్రపంచవ్యాప్తంగా కరోన విజృంభిస్తున్న నేపథ్యంలో పలుదేశాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా అమెరికా ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భౌతిక దూరం పాటించాలంటూ కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తక్షణం ఉపసంహరించాలంటూ అక్కడి వారు ఆందోళనకు దిగారు.

దేశంలోని మిన్నెసోటా, మిచిగాన్, వర్జీనియా, నార్త్ కరోలినా, కెంటకి రాష్ట్రాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. కాలిఫోర్నియాలో వందలాది మంది ఆందోళనకారులు బీచ్‌కి చేరుకుని లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. వీరిలో కొందరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతు దారులు కూడా ఉన్నారు.

ఎంతవేగంగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ఆర్థిక రంగం అంత వేగంగా కోలుకుంటుందన్నది ట్రంప్‌ భావిస్తున్నారు. అందుకే ఆయన లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నారు. అయితే మిన్నెసోటా, మిచిగాన్, వర్జీనియా, నార్త్ కరోలినా, కెంటకి రాష్ట్రాలన్నీ డెమొక్రటిక్ పార్టీకి చెందిన గవర్నర్ల పాలనలో ఉన్నాయి.

Related posts