telugu navyamedia
andhra crime culture news

రెచ్చిపోయిన రౌడీ షీటర్..అంబులెన్స్ కు నిప్పు

ambulense fire

ఓ రౌడీ షీటర్ రెచ్చిపోయి 108 అంబులెన్స్ కు నిప్పు పెట్టాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. సురేష్ అనే మాజీ రౌడీషీటర్ 108కు పదే పదే రాంగ్ కాల్స్ చేస్తుండటంతో సిబ్బంది ఫిర్యాదు మేరకు విచారణ నిమిత్తం తాలూకా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.

అతడు పోలీస్టేషన్ కార్యాలయ అద్దాలు పగలగొట్టడంతో చేతికి తీవ్రగాయాలు కావడంతో అతని మానసిక పరిస్థితి బాగాలేదని భావించారు. ఆ తర్వాత అతడ్ని తీసుకెళ్లేందుకు 108 కాల్ సెంటర్‌కు పోలీసులు ఫోన్ చేశారు.అనంతరం 108 వాహనం ఎక్కిన సురేష్ వెంటనే వాహనం అద్దాలు పగులగొట్టి.. అందులో ఉన్న స్పిరిట్‌తో అంబులెన్స్‌ను తగులబెట్టాడు.

దగ్ధమవుతున్న 108 వాహనంలోనే నిందితుడు ఉండటంతో అతడిని పోలీసులు బయటకు లాగేశారు. అయితే వారి కళ్లుగప్పి సురేష్‌ పరారయ్యాడు. గత నాలుగు రోజులుగా నిందితుడి మానసిక పరిస్థితి బాగోలేక స్టేషన్‌లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని పోలీసులు చెప్తున్నారు.

Related posts

అమెరికాలో .. మరో విమానం కుప్పకూలిన ఘటనలో .. 9మృతి..

vimala p

ప్రముఖులు .. బోనాలు ఎత్తిన వేళ..

vimala p

గుట్కా అమ్మకాలు కూడా అరికట్టాలి: సోము వీర్రాజు

vimala p