telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దేశంలో కరోనా విలయం : రంగంలోకి దిగనున్నఆర్మీ బలగాలు

hawaldar jobs in indian army

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.53 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 2,59,170 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 1761 మంది మృతి చెందారు. మనదేశంలో ప్రతి రోజూ 3 లక్షలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది కేంద్రం. అంతే కాదు లాక్ డౌన్ మాత్రం పెట్టే ఆలోచన లేదని చెప్తోంది కేంద్రం. ఇక కరోనా కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగనుంది కేంద్రం. ఈ మేరకు ఆర్మీ చీఫ్ నర్వానేతో ఫోన్ లో మాట్లాడారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో ఆర్మీ బలగాలను దింపనుంది కేంద్రం. కరోనాను లెక్క చేయకుండా కొందరు ఆకతాయిలు మాస్కులు లేక తిరగడంతో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అలాంటి వారి ఆట కట్టించేందుకు ఆర్మీ బలగాలను ఉపయోగించుకోనుంది ప్రభుత్వం. 

Related posts