రైతు సమస్యలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్లతో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముందు మీడియాతో మంత్రి మాట్లాడుతూ రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాలను కౌలు రైతులకు కూడా అందించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.
అదేవిధంగా కౌలు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, రుణాలు ఇస్తామని చెప్పారు. రెవెన్యూశాఖలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. అదేవిధంగా గిరిజనుల భూముల హక్కులపైనా దృష్టి పెట్టాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.