telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

సముద్రంలో వెడ్డింగ్ రింగ్… క్షణాల్లో వెతికి పెట్టిన సివిల్ డిఫెన్స్

Wedding

దుబాయ్ లోని అజ్మాన్ మెరీనా బీచ్‌కు వెళ్లారు ఆ దంపతులు. అక్కడ సరదాగా గడిపిన అతని భార్య తన చేతి వేలికి ఉన్న వెడ్డింగ్ రింగ్‌ను సముద్రంలో పారేసుకుంది. అదే సమయంలో సముద్రపు నీరు చల్లగా ఉండడంతో దంపతులు లోపల దిగే సాహసం చేయలేకపోయారు. దాంతో వెంటనే అజ్మాన్ సివిల్ డిఫెన్స్‌కు సమాచారం అందించారు. ఆ దంపతుల అభ్యర్థనకు పౌర రక్షణ అధికారులు కూడా సానుకూలంగానే స్పందించారు. వెంటనే ఒక మెరైన్ డైవర్‌ను రంగంలోకి దింపారు. దాంతో డైవర్ రింగ్ పడిపోయిన చోటు నుంచి క్షణాల్లో వెతికి పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను అజ్మాన్ పౌర రక్షణ తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక తమ జీవితాల ప్రత్యేక జ్ఞాపికను(వెడ్డింగ్ రింగ్) తిరిగి ఇచ్చినందుకు ఆ దంపతులు పౌర రక్షణకు కృతజ్ఞతలు తెలిపారు. అజ్మాన్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ అబ్దులాజీజ్ అలీ అల్ షంసీ మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుల్లో పౌరులు ఏమాత్రం ఆలోచించకుండా 997కు ఫోన్ చేసి సివిల్ డిఫెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

 

View this post on Instagram

 

الدفاع المدني بعجمان يسعد زوجين باستخراج دبلة زوجهما من عمق البحر نجح غواصو الفرقة البحرية بالإدارة العامة للدفاع المدني بعجمان في إسعاد وإدخال البهجة إلى قلب زوجين من الجنسية العربية سقط خاتم الزواج من الزوجة بالخطأ في مياه البحر حيث كانا يتنزهان في مرسى الزوراء مارينا يوم أمس السبت، ولم يستطيعا استخراجه بسبب عمق وشدة برودة المياه، فبادرا بالاستغاثة بالدفاع المدني شارحين مشكلتهما، وعليه لبى الدفاع المدني الاستغاثة من خلال الفرقة البحرية التي سارعت إلى موقع الحدث ونجحت في استخراج الدبلة، بدقة ومهارة غواصين الفرقة البحرية تم ذلك خلال وقت وجيز من زمن الغطس. وأعرب الزوجان عن سعادتهما بالحصول على الخاتم، الذي يعد لهما ذكرى خاصة بحياتهما، شكرين فرق الإنقاذ البحري على جهودهم المبذولة. وأكد العميد عبدالعزيز علي الشامسي المدير العام بالدفاع المدني عجمان أن الادارة تستجيب وتلبي النداء لكل الحالات الإنسانية في أي وقت، مشيراً إلى أن الدفاع المدني يولي مثل هذه الحالات أهمية خاصة، حيث تؤكد مثل هذه الاستغاثات من المواطنين والمقيمين ثقة كبيرة من أفراد المجتمع بالخدمات التي يقدم الدفاع المدني، داعياً الجميع بالمبادرة وعدم التردد بالتواصل مع الدفاع المدني عند كل طارئ على هاتف الطوارئ 997 . #الدفاع_المدني _الإعلام_الأمني #ajman997 #moiuae

A post shared by @ ajman997 on

Related posts