telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

పోలీసులకు షాకిచ్చిన 15 అడుగుల పాము… కారులోనే చనిపోయిన వ్యక్తి…

Snake

డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎంత ప్రమాదకరమో తెలియజేసే ఘటన డెన్వర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ఓ వ్యక్తి కారులోనే చనిపోయినట్టు స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు… కారు దగ్గరకు వెళ్లి చూడగా వారికి షాకిచ్చే విషయం ఒకటి జరిగింది. వ్యక్తి ప్రాణాలొదిలిన కారును పరిశీలిస్తున్న సమయంలో 15 అడుగుల పెద్ద పాము అందులో ఉండడం చూసి పోలీసులు షాకయ్యారు. అయితే అది కారు యజమాని పెంచుకున్న పాముగా పోలీసులు గుర్తించారు. మోతాదుకు మించి మద్యం సేవించడంతో ఆ వ్యక్తి కారులోనే మరణించినట్టు పోస్టుమార్టంలో తేలింది. ఇక యజమాని చనిపోయవడంతో పాము కారు నుంచి తప్పించుకుపోవడానికి యత్నిస్తున్న క్రమంలో పోలీసులు దాన్ని పట్టుకొని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఘటనాస్థలికి వెళ్లినప్పుడు డ్రైవర్ విండో నుంచి పాము బయటపడేందుకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. డెన్వర్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ఈ సర్పానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌, ఫేస్‌బుక్ పేజీలలో పోస్ట్ చేసింది. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts