సునీల్ అనే వ్యక్తి సౌదీ అరేబియాలో పనిచేస్తూ అక్కడే నివాసముంటున్నాడు. కొద్ది రోజుల క్రితం తన స్వస్థలమైన కేరళలోని కొల్లానికి వచ్చాడు. అక్కడ 13 ఏళ్ల బాలికను ఏడిపించడం మొదలుపెట్టాడు. బాలిక కుటుంబసభ్యులలో ఓ వ్యక్తికి మందు అలవాటు ఉందని తెలుసుకుని.. అతని ద్వారా బాలికపై కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. అలా బాలికను చిత్రహింసలు పెడుతూ రావడంతో ఓ రోజు బాలిక ఆత్మహత్య చేసుకుంది. దీంతో భయపడిపోయిన సునీల్ వెంటనే తిరిగి సౌదీకి వెళ్లిపోయాడు. బాలిక స్నేహితురాలు సునీల్ గురించి టీచర్‌తో చెప్పడంతో.. వాళ్లు బాధితురాలి కుటుంబసభ్యులకు తెలియజేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నగర పోలీస్ కమిషనర్ మెరిన్ జోసఫ్ సౌదీలోని ఇంటర్‌పోల్ అధికారులను సంప్రదించారు. దీంతో సౌదీలోని రియాద్‌లో తలదాచుకున్న సునీల్‌ను రియాద్ పోలీసులు మూడు వారాల క్రితం అదుపులోకి తీసుకున్నారు. కేరళకు చెందిన పోలీసు అధికారులు సునీల్‌ను తిరిగి కొల్లానికి తీసుకురావడానికి సౌదీ వెళ్లారు.
previous post
కేంద్రం చెబుతున్నా వైసీపీ ప్రభుత్వానికి అర్థం కాలేదు: చంద్రబాబు