telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కిడ్నీ బాధితులకు… నెలకు 10వేల పింఛన్… : వైసీపీ జగన్

10000 pension scheme announced by jagan

ప్రజాసంకల్ప యాత్ర తుది దశలో ఉండటంతో వైసీపీ అధినేత హామీలను భారీగానే ఇస్తున్నారు. ఇప్పటికే విశ్రాంత వయస్సును 45 ఏళ్లకు కుదిస్తామన్న వైసీపీ ఇప్పుడు మరొక భారీ హామీని ప్రకటించింది. నేడు కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర చివరి నియోజకవర్గమైన ఇచ్చాపురంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జగన్ కు ఘనస్వాగతం లభించింది. పలువురు నాయకులు, కార్యకర్తలు, జగన్ పై పూలవర్షం కురిపించారు. నేడు 336వ రోజు పాదయాత్ర సాగుతుండగా, వైఎస్ జగన్ ను ఏడు గ్రామాలకు చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తులు కలిశారు.

ఈ సందర్భంగా వారికి భరోసాను కల్పిస్తూ, అధికారంలోకి రాగానే, నెలకు రూ. 10 వేల పింఛన్ ను కిడ్నీ బాధితులకు ఇస్తానని కీలక హామీని ఇచ్చారు. ఈ ప్రభుత్వం బాధితులకు ఎలాంటి సహాయాన్నీ అందించడం లేదని ఆరోపించిన జగన్, కనీసం సరిపడా డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు కాలేదని విమర్శించారు. ఈ ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తానని, వంశధార మహేంద్రతనయ నుంచి సురక్షిత నీటిని అందిస్తానని హామీ ఇచ్చారు.

Related posts