telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమరావతిలో నిర్మాణాలు .. వద్దన్న కమిటీ.. మంగళగిరి మేలట..

gs committee report on ap capital

ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్దికి అధికార వికేంద్రీకరణ జరగాలని కమిటీ నివేదికలో తెలిపింది. ఇందుకోసం మూడు ప్రాంతాల అభివృద్దితో పాటు రిజియన్‌లుగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రస్తుతం అమరావతిలో కొంత అభివృద్ది జరిగింది. దాన్ని ఏవిధంగా ఉపయోగించుకోవాలలో వివరించింది. అయితే ఇక్కడే ట్విస్ట్‌ను ఇచ్చింది. ఇప్పటి వరకు అమరావతిలో నిర్మాణాల కోసం రైతులు ముప్పై వేల ఎకరాలు ఇచ్చిన విషయం తెలిసిందే…ఈ నేపథ్యంలోనే ఓ కీలక అంశాన్ని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం నిర్మాణాలు జరుపుతున్న ప్రాంతంలో కొన్ని జోన్లు ముంపుకు గురయ్యో అవకాశాలు ఉన్నట్టు పేర్కొంది. దీంతో అక్కడ నిర్మాణాలు జరపకుండా ఉండాలని సూచించింది. అయితే అవి ఎక్కడెక్కడ ఉన్నాయో పూర్తి నివేదిక బయటకు వస్తేగాని తెలియని పరిస్థితి ఉంది.

ఇందుకు ప్రత్నామ్నాంగా అమరావతిలోని ప్రస్తుతం జరుపుతున్న నిర్మాణాలు కాకుండా శాశ్వత నిర్మాణాల కోసం మంగళగిరిలో చేయాలని సూచిచింది. దీంతో భవిష్యత్‌లో వరద ముంపుకు గురికాకుండా ఉండేందుకు మంగళగిరి ప్రాంతం శ్రేయస్కారమని పేర్కోంది. కాగా ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడ చర్యలు చేపట్టింది. ఇదివరకే మంగళగిరి ప్రాంత మున్సిపల్ పరిధిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలు వరద ముంపు కారణంగా మంగళగిరిలో చేపట్టే అవకాశాలకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. మొత్తం మీద అమరావతి ప్రాంతాన్ని ప్రభుత్వం స్ట్రాటజీలో భాగంగానే అమరావతిలో నిర్మాణాలు ఆపివేసింది. నివేదిక వచ్చిన తర్వాత నిర్మాణాలు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రాజధాని నిర్మాణాలపై కమిటీ వేసి నివేదిక కోరింది. పూర్తిగా ప్రతిపక్షనేత చేపట్టిన అమరావతి నిర్మాణం రూపు రేఖలు లేకుండానే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 29 గ్రామాల్లో చేపట్టిన అభివృద్ది అంతా ఇప్పుడు కేవలం తుళ్లూరు, మరియు మంగళగిరి ప్రాంతాలు మాత్రమే అభివృద్ది నోచుకునే అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో అమరావతి అనేది చరిత్రలో ఒక బాగంగానే మిగిలే అవకాశాలే కనిపిస్తున్నాయి.

Related posts