వైసీపీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరులో వైసీపీ బాధితులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నేతల పై మండిపడ్డారు. తమ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని, ఆ పార్టీ నేతలు దాడులు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారని అన్నారు. జగన్ పులివెందుల పంచాయితీ రాష్ట్ర వ్యాప్తంగా జరగదన్నారు. ఆయన్ని పులివెందుల పంపే దాకా వెనుకాడమని అన్నారు.
కొంతమంది పోలీసులు తమ కార్యాకర్తలపై కేసులు బనాయిస్తున్నారని, ఇటువంటి వాటిని సహించమని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వెంకటగిరి ఎంపీడీవో సరళ ఇంటిపై దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి ప్రస్తావించారు. సరళను ఎనిమిది గంటల పాటు పోలీస్ స్టేషన్ ముందు కూర్చోబెట్టారని, ఎమ్మెల్యే కోటంరెడ్డిని అరెస్టు చేసి రెండు గంటల్లో విడిచి పెట్టారని విమర్శించారు.


పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే: ఆర్జీవీ