మూడు రోజుల ఏపీ పర్యటనలో భాగంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. ఇందిరాగాంధీ స్టేడియంలో సీజేఐకు ఇచ్చిన తేనీటీ విందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన సీజేఐ ఎన్వీ రమణ, సీజేఐ సతీమణి శివమాలకు సీఎం వైఎస్ జగన్ దంపతులు స్వాగతం పలికారు.
అనంతరం.. జస్టిస్ ఎన్వీ రమణను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు సీఎం.. అక్కడ తన మంత్రివర్గ సహచరులు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులను సీజేఐకు పరిచయం చేశారు. అలాగే జడ్జిలు, ఇతర న్యాయాధికారులను ఇరువురూ పలకరించారు.
ఈ సందర్భంగా ..ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన తేనీటీ విందులో పాల్గొని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ప్రసంగించారు..
రాష్ట్ర ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలని.. ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఆకాంక్షించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన తనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తేనేటి విందుకు ఆహ్వానించటం సంతోషంగా ఉందని సీజేఐ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు తన తరఫున, తన కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే.. తేనీటీ విందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు.. సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 1965 తర్వాత ఏపీ నుంచి తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడం ఇదే తొలిసారన్నారు. ఇది తెలుగు జాతికి అత్యంత గర్వకారణమని, సీఎంగా తనకు ఎంతో సంతోషకరమని అన్నారు.. సీజేఐ మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కొడాలి నాని, కురసాల కన్నబాబు, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
మళ్లీ అవే ఏడుపులు… చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్