దేశ రాజధాని ఢిల్లీ ఏపీ భవన్ సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం గత రాత్రి ఢిల్లీ ఏపీ భవన్ సమీపంలో 40 ఏళ్ల వయసున్న ఓ మానసిక వికలాంగుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో తేలిందన్నారు. మృతుడు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు.
మృతదేహం పక్కన చిన్న బాటిల్, రూ. 20 నోటును పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.ఈ విషయం పై ఢిల్లీ పోలీసు అధికారి మధుర్ వర్మ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
అందుకే ఆయనను పెళ్లి చేసుకున్నా: మంత్రి పుష్ప శ్రీవాణి