telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆ నలుగురితో నాకు ప్రాణహాని ఉంది : వైసీపీ ఎమ్మెల్యే

MLA Vundavalli Sridevi ycp

గుంటూరు జిల్లా తాడికొండలో రాజకీయం రోజు రోజుకు ముదురుతోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మరోసారి తెరపైకి వచ్చారు. తన మాజీ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఫిర్యాదు చేశారు. తాడికొండ పీఎస్‌లో నలుగురిపై ఫిర్యాదు చేసారు ఎమ్మెల్యే శ్రీదేవి. సోషల్‌ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపణలు చేసారు. ఈ మేరకు సందీప్‌, సురేష్‌ మరో ఇద్దరి నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సందీప్‌, సురేష్‌ ఇటీవలే వైసీపీ నుంచి సస్పెన్షన్ ‌కు గురయ్యారని…పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారన్న కక్షతో తనపై దుష్ర్పచారం చేస్తున్నారని ఉండవల్లి శ్రీదేవి ఆరోపణలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపణలు ఎంతవరకు నిజం..అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Related posts