*వేద మంత్రాలతో మారుమ్రోగుతున్న యాదాద్రి..
*యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులు..
*యాదాద్రిలో భారీగా పోలీసు బందోబస్తు..
*4వేల మంది పోలీసులు,400 సీసీ కెమెరాలతో భద్రత..
*ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో యాగ జలాలతో సంప్రోక్షణ..
నేడు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పున ప్రారంభం కానుంది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి భక్తులకు ఇవాళ్టి నుంచి నిజరూప దర్శనం ఇయ్యనున్నారు. ఆరేళ్లుగా ఎదరు చూస్తున్న యాదాద్రి నరసింహుని దివ్వదర్శనం మరి కాసేపట్లో భక్తులకు కలుగనుంది.
ఈ క్రమంలో యాదాద్రికి సీఎం కేసీఆర్ దంపతులు చేరుకున్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి శోభాయాత్ర ప్రారంభమైంది. బాలాలయం నుంచి యాత్ర ప్రారంభం కాగా, ఇందులో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సమక్షంలో యాగ జలాలతో జరిగే సంప్రోక్షణలో మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. కాసేపట్లో మహాకుంభ సంప్రోక్షణ లో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొననున్నారు. ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకోటికి దర్శనం ఇవ్వనున్నారు.
ఇందుకోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. లక్షల మంది భక్తులు వచ్చినా వారందరు సౌకర్యవంతముగా స్వామివారి ని దర్శించుకునేల ఏర్పాట్లు చేశారు. మూడంతస్తుల క్యూ కాంప్లెక్స్, వెయ్యి అడుగుల క్యూ లైన్లు, సకల సదుపాయాలతో సర్వం సిద్ధం చేశారు.
4వేల మందితో భద్రత..
మరోవైపు .. ఆలయ ఉద్ఘాటన, మహా క్రతువుకు ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు నేపథ్యంలో 4వేల మంది పోలీసులు,400 సీసీ కెమెరాలతో భద్రత భద్రతను నిర్వహిస్తున్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్, భువనగిరి డిసిపి నారాయణరెడ్డి ఆదివారం ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రూట్మ్యాప్ రూపొందించారు. ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కొండ కింద నుంచి పైకి రవాణా సౌలభ్యం కోసం ఆర్టీసీ‘యాదాద్రి దర్శని’ బస్సులను సిద్ధం చేసింది.