ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించడంపై తెలంగాణ బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి చేరుకుని పటాకులు కాల్చారు.
వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ నేత చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు పరస్పరం స్వీట్లు పంచుకున్నారు.