telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేషన్ డీలర్ కోసం .. బతుకమ్మ చీరలు వద్దన్న మహిళలు..

women protest for ration dealer in

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా చౌర స్తాలో కాలనీవాసులు బతుకమ్మ చీరలు మా కొద్దు అంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రేషన్‌ డీలర్‌ను బుదేరా చౌరస్తాకు సపరేట్‌గా ఏర్పాటు చేయాలని నాలుగు నెలలుగా అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు అధికారుల తీరుపై మండిపడ్డారు. రేషన్‌ డీలర్‌ షాపును ఏర్పాటు చేసేంతవరకు బతుకమ్మ చీరలు, చెత్త బుట్టలు, వివిధ రకాల మొక్కలను కూడా తీసుకోబోమని నినాదాలు చేశారు.

తహసీల్దార్‌ సువర్ణ రాజుకు అక్కడికి చేరుకుని నిరసన కారులతో మాట్లాడి రేషన్‌ డీలర్‌ను బుదేరా చౌరస్తాకు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమం విరమించారు. అనంతరం మహిళలు బతుకమ్మ చీరలు, చెత్త బుట్టలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.

Related posts