telugu navyamedia
సినిమా వార్తలు

మీటూ ఎఫెక్ట్… ఇకపై న్యూయార్క్‌లో కూడా…!

WIF

సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల విషయమై గతంలో పెద్ద దుమారమే చెలరేగింది. సినీ ప్రముఖులపై “మీటూ” అంటూ చాలామంది తమ గళాన్ని విప్పి, ఆయా వ్యక్తుల ద్వారా తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే హాలీవుడ్ లో కూడా “మీటూ” ఉద్యమం ఉధృతంగా సాగింది. దీంతో సినిమా, టెలివిజన్ రంగాల్లో ఉన్న మహిళలకు సహకారం అందించేందుకు వుమెన్ ఇన్ ఫిల్మ్ లాస్‌ఏంజిల్స్ (డబ్ల్యూఐఎఫ్) అనే సంస్థ పనిచేస్తోంది. ఈ రంగాల్లోని మహిళలను ఎవరైనా లైంగికంగా వేధిస్తే, వారు వెంటనే డబ్ల్యూఐఎఫ్ వారి సెక్సువల్ హెరాస్‌మెంట్ హెల్ప్‌లైన్ నంబరుకు కాల్ చేస్తే చాలు. సదరు బాధితురాలికి చేయవలసిన పని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాల్లో డబ్ల్యూఐఎఫ్ సిబ్బంది సలహాలిస్తారు. సినిమా, టెలివిజన్ రంగాల్లో నటీమణులపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో చెలరేగిన ‘మీటూ’ ఉద్యమ ఫలితంగానే దీన్ని స్థాపించారు. ఇప్పటి వరకు ఈ సంస్థ లాస్‌ఏంజిల్స్‌లో మాత్రమే తమ సేవలందిస్తోంది. అయితే తాము ఇకపై న్యూయార్క్‌లో కూడా అందుబాటులో ఉంటామని, సినిమా, టీవీ రంగాల్లోని మహిళలకు లైంగిక వేధింపులు లేకుండా చేయడమే తమ లక్ష్యమని డబ్ల్యూఐఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిర్‌స్టన్ స్కాఫర్ తెలిపారు.

Related posts