telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బోండా ఉమ చిల్లర రౌడీ ..ఆయనకు చెప్పుదెబ్బలు గ్యారంటీ

విజ‌య‌వాడ అత్యాచార బాధితురాలి అంశంపై టీడీపీ రాజకీయాలు చేస్తోందని ఏపీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. సోమవారం పద్మ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరు దురదృష్టకరమన్నారు.

మూడేళ్లుగా మహిళా కమిషన్ తరఫున పనిచేస్తున్నా ఏ రోజు కూడా పబ్లిసిటీ గురించి పట్టించుకోలేదని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. బోండా ఉమ ఆకు రౌడీ అనుకున్నానని.. కాదు ఆయన చిల్లర రౌడీ అని ఎద్దేవా చేశారు.

బోండా ఉమ రాజకీయ నాయకుడి వేషంలో ఉన్న కాలకేయుడని, అతనికి మహిళలే బుద్ధి చెబుతారని విమర్శించారు.సాదాసీదాగా పోయే చంద్రబాబు పరామర్శను బోండా ఉమానే ఓవరాక్షన్ చేసి తనకు పబ్లిసిటీ కల్పించారని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.

మహిళా కమిషన్ పదవి ఊడే వరకూ పోరాడతానని బోండా చెబుతున్నాడు. నేను మహిళా కమిషన్ ఛైర్మన్‌గా దిగిపోవడం బోండా ఉమ ఆశయమా. నా పదవి పోయే వరకూ పోరాడమని చంద్రబాబు బోండాకు చీర కట్టి పంపించాడు. బోండా ఉమ తన పేరును సార్ధకం చేసుకుంటున్నాడు.

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో తనపై టీడీపీ నేతలు చేసిన దాడి అంశాన్ని వ్యక్తిగత దాడిగా పరిగణనలోకి తీసుకోలేదని వాసిరెడ్డి పద్మ తెలిపారు. బాధ్యత లేకుండా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని… ఇష్టానుసారం మాట్లాడితే ఆయనకు చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. బోండా ఉమాకు ముందుంది ముసళ్ల పండగ అని..ఆయనకు మహిళలే తగిన బుద్ధి చెప్తారన్నారు.

,

Related posts