telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తారకరామునికి నీరాజనములతో 102 వ జయంతి శుభాకాంక్షలు

క్రుషి ఉంటె మనుషులు రుషులౌతారు మహాపురుషులౌతారు అంటూ సామాన్యునిగా జన్మించి ఆశమాన్యుడు గా ఎదిగి కళారంగంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కళాప్రపూర్ణ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు గాా అభిమానుల గుండెల్లో నిలిచారు.

తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం స్థాపించి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అంటూ బడుగు బలహీన వర్గాల కోసం శ్రామిక కార్మిక కర్షకుల కోసం ఎన్నో నూతన పధకాలు ప్రవేశపెట్టి,

మహిళలకు ఆస్తి హక్కు తో పాటు విశ్వవిద్యాలయాలు స్తాపించి ప్రపంచం దేశాలకే ఆదర్శంగా నిలిచిన మహాపురుషుడు.

దేవతా మూర్తులకు ప్రతిరూపంగా నిలిచి తెలుగింటి ఇలవేలుపుగా అఖిలాంధ్రుల కు ఆత్మబంధువు మనుషుల్లో దేవుడు కలియుగరాముడు.

మా దైవం తారకరామునికి నీరాజనములతో 102 వ జయంతి శుభాకాంక్షలతో శుభోదయం.

Related posts