telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతి మహిళలపై సాక్షి మీడియా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: వైఎస్ షర్మిల

రాజధాని అమరావతికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్షమాపణలు చెప్పడం వైఎస్ భారతీరెడ్డి బాధ్యత అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పడంలో తప్పులేదన్నారు. సోమవారం విజయవాడలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విలేకర్లతో మాట్లాడుతూ రాజధాని అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరానిదని ఆమె అభిప్రాయపడ్డారు.

అమరావతిపై వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఏపీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని చెప్పారు.

ఈ అంశంపై ఇప్పటి వరకు వైసీపీ కానీ, సాక్షి మీడియా కానీ క్షమాపణ చెప్పలేదని వైఎస్ షర్మిల గుర్తు చేశారు.

Related posts