telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజమండ్రి : .. ఉదృతంగా .. గోదారమ్మ … వణికిపోతున్న గిరిజన గ్రామాలు..

water flow increased again in godavari

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో ప్రవాహం పెరుగుతోంది. గత 2రోజుల్లో గోదావరి నీటి మట్టం గణనీయంగా పెరిగింది. వరద ప్రవాహం రెండో ప్రమాదస్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద 175 గేట్లను అధికారులు ఎత్తివేశారు. 5లక్షల 60వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం గోదావరి తీరగ్రామాలకు మళ్లీ వరద రావడంతో గిరిజన గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. దేవీపట్నం మండలంలోని గువ్వలపాలెం, ఏ.వీరవరం, తొయ్యూరు, దేవీపట్నం పొలాల్లోకి వరదనీరు చేరింది.

Related posts