telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సోదరుడు కేశినేని చిన్నిపై టీడీపీ ఎంపీ కేనినేని నాని ఫిర్యాదు..

*టీడీపీ లో కేశినేని బ్ర‌ద‌ర్స్ వార్‌
*సోదరుడు కేశినేని చిన్నిపై టీడీపీ ఎంపీ కేనినేని నాని ఫిర్యాదు
*మే నెల 27న ఎంపీ నాని ట‌ప‌ట‌ప పోలీస్ స్టేష‌న్ ఫిర్యాదు
*త‌న పేరు చెప్పి వ్యాపార‌స్తుల‌ను బెదిరిస్తున్న‌ట్లు ఫిర్యాదు..

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కుటుంబంలో కుటుంబ వివాదం తారా స్దాయికి చేరుతోంది. త‌న పేరు, హోదాను ఉపయోగించుకొని, గుర్తు తెలియని వ్యక్తులు వ్య‌వ‌హ‌రాలు సాగిస్తున్నార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

తాను వినియోగించే వీఐపీ వాహన స్టిక్కర్ ను పోలిన నకిలీ స్టిక్కర్ వినియోగించి హైదరాబాద్, విజయవాడలో తిరుగుతూ తిరుగుతు,త‌న పేరు వాడుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

అలాంటి వారి పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, వాహనం నెంబరు టీఎస్ 07 హెచ్ డబ్ల్యూ 7777గా పేర్కొంటూ విజ‌య‌వాడ పటమట పోలీసులకు ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు చేశారు.

మే నెల 27న ఎంపీ నాని ఫిర్యాదు చేయగా జూన్ 9వ తేదీన పోలీసులు, ఎఫ్ఐ ఆర్ నమోదు చేశారు. ఐపీసీ 420, 416, 415, 468, 499 35 3534 80 (ఎఫ్ఐఆర్ 523/2022) నమోదు చేశారు. అయితే ఇదే వాహనాన్ని సోమవారం హైదరాబాద్ పోలీసులు గుర్తించి తనిఖీ చేశారు. అన్నీ సవ్యంగానే ఉన్నట్లు గుర్తించి వదిలివేశారు.

అయితే ఈ వాహనం కేశినేని జానకి లక్ష్మి పేరు మీద ఉంది. దీన్ని ఆమె భర్త కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని వినియోగిస్తున్నారు. కేశినేని చిన్ని స్వయంగా నానికి సోదరుడు కావ‌టం విశేషం. చిన్ని హైదరాబాద్ లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సొంత సోదురుడి పైనే ఫిర్యాదు చేయడంతో ఎఐఫ్ఆర్ నమోదు కావడం, పోలీసులు విచారణ చేయడంతో ఈ వ్య‌వ‌హ‌రం అంతా ఆల‌స్యంగా బ‌య‌ట‌కు రావ‌డంతో చ‌ర్చానీయాంశంగా ఉంది.

విజయవాడ ఎంపీగా కేశినేని నాని టీడీపీ నుంచి రెండు సార్లు గెలుపొందారు. కేశినేని నాని సోదరుడు కేశినేని  శివనాథ్ కొంతకాలంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కేశినేని నాని స్థానంలో కేశినేని శివనాథ్ టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

పార్టీ అధినేత చంద్రబాబే.. నానికి వ్యతిరేకంగా శివనాథ్ ను ప్రోత్సహిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. కొంతకాలంగా కేశినేని నాని పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. టీడీపీ మహానాడుకు కూడా ఆయన హాజరుకాలేదు.

ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని చంద్రబాబు.. కేశినేని నానికి అప్పగించినా బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా ఆయనకు ఎదురుతిరిగారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో విబేధాలు మరింత భగ్గుమన్నాయి. మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేతను ప్రకటించడాన్ని బుద్ధా వెంకన్న, బొండా ఉమాతో పాటు పలువురు నేతలు వ్యతిరేకించారు.

అటు విజయవాడ పార్లమెంట్ పరిధిలోని జగ్గయ్యపేట, మైలవరం వంటి నియోజకవర్గాల నేతలతోనూ కేశినేని నానికి సత్సంబంధాలు లేవు. దీంతో కేశినేని నాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండగా.. అదే సమయంలో ఆయన సోదరుడు కేశినేని శివనాథ్.. టీడీపీలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శివనాథ్ పై కేశినేని నాని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది.

Related posts