telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

శ్రీశైలం జలాశయంలో పోటెత్తిన వరద నీరు

srisailam project with full of water

ఉమ్మడి మహబూబ్ నగర్, కర్నూలు, జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 869.90 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలు, ప్రస్తుతం 141.3285 టీఎంసీలు, ఇన్ ఫ్లో 1,22,057 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 43.048 క్యూసెక్కులు నీరు చేరింది. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు చేరుకోవడంతో, అధికారులు 70 గేట్లనూ ఎత్తివేశారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 1.10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, 91 వేలను నది ద్వారా సముద్రంలోకి, మిగతా నీటిని కాలువల ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యవసాయ పనుల నిమిత్తం వదులుతున్నారు. మున్నేరుతో పాటు కట్టలేరు, వైరాల ద్వారా ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వస్తోందని అధికారులు వెల్లడించారు.

Related posts