ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ రోజు మధ్యాహ్నం కలిశారు. రాజ్ భవన్ కు వెళ్లిన విజయసాయి గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది.
విజయసాయిరెడ్డితో పాటు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా రాజ్ భవన్ కు వెళ్లినట్టు సమాచారం. రాజ్ భవన్ కు విజయసాయిరెడ్డి వచ్చిన విషయాన్ని రాజ్ భవన్ వర్గాలు ట్విట్టర్ ద్వారా వెల్లడించాయి.
జైలులో జగన్ తో ఉన్నవారికి ఇప్పుడు పెద్ద పదవులు: చంద్రబాబు