telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రారంభ‌మైన వైసీపీ మంత్రుల సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర

ఏపీ మంత్రుల సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర గురువారం ఉదయం ప్రారంభమైంది. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పదవుల కేటాయింపులో సామాజిక విప్లవాన్ని సృష్టించిన తీరును ప్రజల్లోకి వెళ్లి వివరించడం ద్వారా వారిలో ఉండే అపోహాలను తొలగించవచ్చని అధిష్టానం భావిస్తోంది.

ఈనేపథ్యంలో బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలకు చెందిన 17 మంది మంత్రులు ఈ బస్సు యాత్రలో భాగస్వామ్యం అవుతున్నారు. ప్రతిపక్షాల జోరుకు బ్రేకులు వేయాలంటే మంత్రులు నాలుగు రోజులపాటు యాత్ర చేసి, ప్రభుత్వ పథకాలపై మరింత ఎక్కువగా ప్రచారం చేసి, తమ పాలనపై ప్రజలలో మరింత అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ బస్ టూర్‌కు శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీకాకుళం సెవెన్‌ రోడ్స్‌ జంక్షన్‌లో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్ర‌హానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మంత్రులు బస్సుయాత్రను ప్రారంభించారు. జిల్లాలోని చిలకపాలెం, రణస్థలం, పైడిభీమవరం మీదుగా విజయనగరం జిల్లాకు మంత్రులు వెళ్లనున్నారు.

Related posts