telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ ప్రేమించిన అమ్మాయిలకు పెళ్లి అయిపోయిందట…!?

Vijay-Devarakonda

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. ఈ యంగ్ హీరో లవ్ లో పడ్డాడంటూ కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ తన క్రష్ వీళ్ళేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిలిం కంపానియన్ అనే వెబ్‌సైట్ ఇటీవల టాప్ 100 గ్రేటెస్ట్ పెర్ఫామెన్సెస్ పేరుతో ఓ డిబేట్ ఏర్పాటుచేసింది. ఈ డిబేట్‌కు ఆలియా భట్, దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్, మనోజ్ బాజ్‌పాయ్, విజయ్ దేవరకొండ, ఆయుష్మా్న్ ఖురానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు దీపిక, ఆలియాపై క్రష్ ఉండేదని విజయ్ అన్నారు. “ఇక్కడ కూర్చున్న చాలా మందికి దీపిక పదుకోన్, ఆలియా భట్‌లపై క్రష్ ఉంది. నాకు కూడా ఉంది. కానీ ఏం లాభం దీపిక పదుకోన్‌కి పెళ్లైపోయింది. ఆలియా కూడా పెళ్లి చేసేసుకుంటోంది” అన్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న దీపిక.. ‘త్వరలో ఆలియాకు కూడా పెళ్లి చేసుకుంటంది’ అని కన్‌ఫర్మ్ చేసేసింది. అయితే తన అనుమతి లేకుండా దీపిక తన పెళ్లి గురించి ప్రకటించేయడంతో ఆలియాకు కాస్త కోపం వచ్చింది. ‘ఎక్స్‌క్యూజ్‌మీ.. నా అనుమతి లేకుండా పెళ్లి గురించి ఎలా డిక్లేర్ చేసేస్తారు?’ అని దీపికపై మండిపడింది. అప్పుడు దీపిక తనని తాను సమర్ధించుకుంటూ.. ‘గయ్స్.. విజయ్ దేవరకొండ రియాక్షన్ ఏంటో చూద్దామని అలా చెప్పాను’ అన్నారు. 2020లో వీరిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. ఫ్రాన్స్‌లో పెళ్లట. మరో రెండు వారాల్లో ఫ్రాన్స్‌లో వీరి వివాహం ఘనంగా జరగనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

Related posts