వెన్నెల్లో ఒక్కడినే కూర్చున్నా
ఒంటరినన్న భావన కలగదు
నిన్నూ నన్నూ కలిపే దారంలా 
వెన్నెల!
అప్పుడెప్పుడో
నువ్వు వెన్నెల్లో 
తడుస్తున్నప్పటి రూపం…
ఎన్నేళ్లయినా చెరగని దృశ్యం!
కొబ్బరాకుల నడుమ 
నర్తిస్తూ వెన్నెల రేడు
పుడమీ ,చెట్లూ,చుక్కలూ…ప్రేక్షకులు!
నువ్వే అనుకున్నా
నీకన్నా అల్లరి చేస్తుంది, వెన్నెల్లో కొబ్బరాకు
గాలి తాళానికి దాని టపటప రాగం…
చిలిపితనం నీలాగే తనకీ జన్మహక్కా!?
– సాంబమూర్తి లండ,
    9642732008



సుదర్శన యాగంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి: హరీష్ రావు