విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా ‘దృశ్యం 2. దగ్గుబాటి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న “దృశ్యం 2” మూవీ విడుదల తేదీని తాజాగా టీజర్ తో పాటు రివీల్ చేశారు మేకర్స్.ఈ మేరకు చిత్రనిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. దీంతో పాటు టీజర్‌ను రిలీజ్ చేసింది.
ఆరు సంవత్సరాల క్రితం వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రలో నటించిన ‘దృశ్యం’ సినిమాకు ఇది సీక్వెల్’.ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఈనెల 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మారిన పరిస్థితులు, మిస్టరీ, క్రైమ్-డ్రామాను ఆసక్తికర రీతిలో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ప్రతి ట్విస్ట్ ప్రక్షేకులను ఆకట్టుకునేలా రూపొందించారు.
జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో మీనా, నదియా, నరేష్, కృతిక, ఎస్తేర్ అనిల్ నటించారు. సంపత్ రాజ్, పూర్ణ కొత్త పాత్రల్లో కనిపించారు. సురేష్ ప్రొడక్షన్స్, రాజ్‌కుమార్ థియేటర్స్ మరియు మాక్స్ మూవీస్ నిర్మాతలుగా.. దృశ్యం సినిమాకు సిక్వెల్‌గా దృశ్యం 2 సినిమా విడుదల కానుంది.
కాగా.. దృశ్యం 2 చిత్రం హక్కులను ప్రైమ్ సొంతం చేసుకుని.. ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా టీజర్ ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం వెంకీ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమాకు వెంకీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
Can the scars of the past ruin their future? In Rambabu's world, reality is stranger than fiction.
Watch #Drushyam2OnPrime, Nov. 25 only on @PrimeVideoIN
▶️https://t.co/xUM4QUHR3u@VenkyMama #MeenaSagar #JeethuJoseph @aashirvadcinema @antonypbvr @anuprubens #SatheeshKurup pic.twitter.com/LobRGTom4E
— Suresh Productions (@SureshProdns) November 12, 2021
బిగ్ బాస్-3 : రాహుల్ పై వితిక షాకింగ్ కామెంట్స్…!?