తెలుగువారి గుండెచప్పుడు ఎన్టీఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు.
‘తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్. పురాణ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించారు. రాజకీయాల్లోనూ నవశకానికి నాంది పలికారు.
ఎన్టీఆర్ దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశారు. నిరంకుశ రాజకీయాలకు ఎదురొడ్డి నిలిచారు. గొప్ప సంస్కరణ వాది” అని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు.


సీపీఐ కాళ్లు పట్టుకున్నందుకు కేసీఆర్ కు సిగ్గుండాలి: కోమటిరెడ్డి