కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోమవారంనాడు బీహార్లో జరిగిన ఎన్నికల సభలో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
సభా వేదకలోని కొంత భాగం కిందకు కృంగిపోవడంతో రాహుల్ గాంధీ వెంటనే నిలదొక్కుకోడవంతో భద్రత సిబ్బంది ఊపరి పీల్చుకున్నారు.
పాటలీపుత్ర లోక్సభ నియోజకవర్గంలోని పాలిగంజ్లో సోమవారంనాడు ఈ ఘటన చోటుచేసుకుంది.
రాహుల్ గాంధీని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి వేదిక పైకి తీసుకువెళ్తుండగా వేదికలోని ఒక భాగం కిందకు కృంగిపోయింది.
వెంటనే రాహుల్ నవ్వుతూ వేదికపై నుంచి సభికులకు చేయి ఊపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
పాటలీపుత్ర లోక్సభ సీటు నుంచి మిసా భారతి పోటీ చేస్తున్నారు.
గత పాలనలో అంతా అవినీతే.. అసెంబ్లీలో మంత్రి బొత్స