వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ప్రకాశం జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ నమ్మించి నట్టేట ముంచడం జగన్ నైజమని అన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఆశ చూపి అభ్యర్థులతో కోట్లు ఖర్చుపెట్టిస్తారని ఆయన ఆరోపించారు.
తీరా ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇస్తామంటూ మభ్యపెట్టడం జగన్‌కు పరిపాటిగా మారిందని చెప్పుకొచ్చారు. నవరత్నాలు ప్రకటించి ఏ రత్నం ఇవ్వాలో తెలియని అయోమయంలో జగన్ ఉన్నారని వంగవీటి రాధా ఎద్దేవా చేశారు. విజయవాడ సెంట్రల్ టికెట్ దక్కకపోవడంతో రాధా వైసీపీని వీడి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.
నిరుద్యోగులపై కక్ష ఎందుకు.. జగన్ పై లోకేశ్ విమర్శలు