మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈరోజు (గురువారం) భేటీ అయ్యారు.
వరుస కేసులతో ఐదు నెలలుగా జైలులో ఉన్న వంశీ బెయిల్ రావడంతో నిన్ననే(బుధవారం) జైలు నుంచి విడుదలయ్యారు. ఈరోజు తమ అధినేత జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు.
కుటుంబంతో కలిసి జగన్‌ను కలిశారు వంశీ. ఈ సందర్భంగా జైలు జీవితం, తదితర పరిణామాలపై అధినేతతో వంశీ చర్చించినట్లు తెలుస్తోంది.
కాగా.. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ఈఏడాది ఫిబ్రవరి 16న హైదరాబాద్‌లో వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఆ తరువాత వరుసగా ఆయనపై కేసులో నమోదు అయ్యాయి. వంశీపై దాదాపు 11 కేసులు నమోదు అవగా.. 140 రోజుల పాటు జైలులో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే.
గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడితో పాటు నకిలీ ఇళ్ల పట్టాలు, భూముల కబ్జా వంటి కేసులు ఆయనపై నమోదు అయ్యాయి.
ఈ కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఐదు నెలల పాటు విజయవాడ జిల్లా జైలులోనే వంశీ ఉన్నారు.
జైలులో ఉన్న సమయంలో చాలా సార్లు అనారోగ్యం బారిన పడ్డారు వంశీ. శ్వాసకోస సంబంధిత సమస్యతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు.
ఐదు నెలల పాటు జైలులో ఉన్న వంశీకి నెల క్రితం రెండు కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. తాజాగా నకిలీ పట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
దీంతో వంశీపై ఉన్న అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు కావడంతో నిన్న మధ్యాహ్నం విజయవాడ జైలు నుంచి వంశీ విడుదలయ్యారు.
ఈ సందర్భంగా ఈరోజు సతీమణితో కలిసి వైసీపీ అధినేత జగన్‌ను మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు.