telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

విడుదల కాకముందే రికార్డు సాధించిన ‘వకీల్‌సాబ్‌’…

రాజకీయాల కారణంగా రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం మోస్ట్ ట్విట్‌డ్‌ తెలుగు మూవీ ఇన్‌ 2020 గా టాప్‌ ప్లేస్‌లో నిలిచినట్లుగా ట్విట్టర్‌ ఇండియా ప్రకటించింది. పవన్‌కళ్యాణ్‌ మూడేళ్ల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో వకీల్‌సాబ్‌పై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారో ఇప్పుడు మరోసారి రుజువైంది. 2020లో మోస్ట్ ట్వీటెడ్ సినిమాగా వకీల్‌సాబ్‌ చరిత్ర సృష్టించింది. సోషల్ మీడియాలో అందరికంటే ఎక్కువగా పవన్ సినిమా కోసం అభిమానులు వేచి చూశారు. ఆయన సినిమా గురించి ట్వీట్ చేశారు. ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా దేశవ్యాప్తంగా దాన్ని వైరల్ అయ్యేలా చేశారు. ముఖ్యంగా వకీల్‌సాబ్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల అయినప్పుడు సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. 24 గంటల్లో ట్విట్టర్ లో హైయెస్ట్ రీ ట్వీట్స్ సాధించిన సినిమాగా చరిత్రను తిరగ రాసింది వకీల్ సాబ్. ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీకపూర్‌  సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2021 సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎప్పటికి విడుదల అవుతుంది అనేది.

Related posts