telugu navyamedia
క్రీడలు తెలంగాణ వార్తలు వార్తలు

ఉప్పల్ స్టేడియంలో జిహెచ్ఎంసి సమ్మర్ కోచింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

జిహెచ్ఎంసి సమ్మర్ కోచింగ్ క్యాంప్ ను ఉప్పల్ స్టేడియంలో స్థానిక శాసన సభ్యులు భేతి సుభాష్ రెడ్డి, చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్, మీర్ పేట్ హెచ్.బి కాలనీ కార్పొరేటర్ ప్రభు దాస్, మల్లాపూర్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి,  జోనల్ కమిషనర్ పంకజ, డిప్యూటీ కమిషనర్ అరుణ లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఉప్పల్ శాసనసభ్యులు భేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ… ఏప్రిల్  25 నుండి మే 31 వరకు  37 రోజుల పాటు  44 ఈవెంట్స్ లో 915 సెంటర్లలో 6 నుండి 16 సంవత్సరాల పిల్లలకు ఉదయం 6:15 నిమిషాల నుండి 8:15 వరకు 77 మంది పార్ట్ టైమై, 712 హానర్ ఏరియం కోచ్ లు శిక్షణ అందిస్తున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ ద్వారా కాప్రా సర్కిల్ లో 55 సెంటర్లు, ఉప్పల్ సర్కిల్ లో 27 సెంటర్లు, ఎల్బీనగర్ 23 సెంటర్లు, హయత్ నగర్ లో 34 సెంటర్లు, సరూర్నగర్ 16 సెంటర్లలో శిక్షణ కొనసాగిస్తామన్నారు.

జోనల్ కమిషనర్ ఎల్బీనగర్ పంకజ మాట్లాడుతూ. క్రీడల వల్ల విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్రికెట్, చెస్, ఫుట్ బాల్, జిమ్నాస్టిక్స్, కరాటే, కబడ్డీ, 44 క్రీడా విభాగంలో శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మార్చ్ ఫస్ట్ లో మొదటి బహుమతి ఎన్ సి సి 1 తెలంగాణ, ద్వితీయ బహుమతి రాఘవేంద్ర, తృతీయ బహుమతి కన్నం గౌడ్ లకు బహుమతులు అందజేశారు.

Related posts