telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

పెరిగిన గూగుల్ ఆదాయం.. ఎలా అంటే…?

google logo

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా తలాకుతలం చేస్తుంది. ఈ వైరస్ కారణంగా చాలా రంగాలు దెబ్బ తిన్నాయి. ఆర్ధికంగా నష్ట పోయాయి. ఇక కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అనేది పెరిగింది. దీనివల్ల ఆయా సంస్థలకు ఉద్యోగుల ఖర్చు భారీగా తగ్గింది. కరోనా నేపథ్యంలో గతేడాదిగా ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇస్తున్న విషయం తెలిసిందే. ఏడాది కాలంలో దాదాపు రూ. 100 కోట్ల డాలర్లు ఆదా అయినట్లు గూగుల్ వెల్లడించింది. భారత కరెన్సీలో ఇది రూ. 7500 కోట్ల మేర ఆదా అయింది. కంపెనీ ప్రచారం, ఉద్యోగుల ప్రయాణాలు, అలవెన్సులు, వినోద ఖర్చులపై 26.8 కోట్ల డాలర్లు ఆదా చేసినట్లు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ వెల్లడించింది. మరి చూడాలి ఈ వార్త కారణంగా ఇంకా ఎన్ని కంపెనీలు ఈ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ను ఆధరిస్తాయి అనేది.

Related posts