ఉత్తరప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులంతా సచివాలయానికి రాకుండా ఇంటి వద్ద నుంచే వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ లక్నోలో ఇచ్చిన పార్టీకి యూపీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ హాజరుకావడంతో… ఇప్పుడు ఆయన స్వయంగా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్నారు. మరోవైపు, కరోనా విస్తరించకుండా యూపీ ప్రభుత్వం పలు చర్యలను చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.