ఏపీలో అధికార వైసీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సఫలీకృతమవుతోంది. టీడీపీ నేతలు ఒకొక్కరూ వైసీపీ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో కరణం బలరాం కుమారుడు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లాలో టీడీపీకి మరో భారీ షాక్ తగలబోతోంది. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు తన కుమారుడితో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆన్ లైన్ లో పార్టీ నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ పార్టీకి ద్రోహం చేసిన వారెవరినీ ప్రజలు ఆదరించరని అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పార్టీకి ద్రోహం చేసినవాళ్లు చరిత్రహీనులుగా మిగిలిపోతారని స్పష్టం చేశారు. ద్రోహులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అన్నారు.
ఎలా గెలిచారో తెలిసిపోయింది.. సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు