telugu navyamedia
వార్తలు సామాజిక

పరీక్షల నిర్వహనకు యూనివర్సిటీలు సిద్ధం..!

exam hall

దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో యూజీ, పీజీ చివరి సంవత్సర పరీక్షలు తప్పనిసరి చేస్తూ ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) విధి విధానాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. యూజీసీ చేసిన ప్రకటనపై దేశంలోని యూనివర్సిటీలు సానుకూలంగా స్పందించాయి.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని 755 యూనివర్సిటీల్లో ఇప్పటికీ పరీక్షలు నిర్వహించని 366 వర్సిటీలు త్వరలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విషయాన్ని యూజీసీకి వర్సిటీలు తెలిపాయి. కాగా ఇప్పటికే 194 యూనివర్సిటీలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాయి.

యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల్లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీల్లో డిగ్రీ చివరి ఏడాది విద్యార్థులకు ఆగస్టులో పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రకటించింది.భౌతిక దూరం, మాస్కులు ధరించి, శానిటైజర్లు వాడకం, ధర్మల్‌ స్ర్కీనింగ్ వంటి నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

Related posts