కేవలం వారం రోజుల్లో టర్కీ సరిహద్దును అతిక్రమించేందుకు ప్రయత్నించిన దాదాపు 3,700 మందికి పైగా అక్రమ వలసదారులను భద్రతా దళాలు నిర్బంధించాయని టర్కీ అధికార వార్తా సంస్థ అనడోలు వెల్లడించింది. ఈశాన్య ప్రాంతంలో గ్రీస్, బల్గేరియా సరిహద్దు ప్రాంతాల్లో వున్న ఎడిర్న్ ప్రావిన్స్ వద్ద సరిహద్దు దాటి అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న 1,475 మంది అక్రమ వలసదారులను భద్రతా దళాలు నిర్బంధించాయి.
గ్రీస్ ద్వారా ఐరోపా దేశాలలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న దాదాపు 1,500మంది అక్రమ వలసవాసులను తీర ప్రాంతంలో వున్న ముగ్లా, కనక్కలే, ఇజ్మిర్, బలికెసిర్, మెర్సిన్, అయిడిన్ తదితర ప్రావిన్స్‌ల్లో భద్రతా దళాలు నిర్బంధించాయి. వాయవ్య ప్రాంతంలోని కిర్కరెలి, టెకిర్‌డాగ్ ప్రావిన్స్‌ల్లో 303 మందిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్లు ఈ వార్తా సంస్థ తన కథనంలో వెల్లడించింది.
“డబ్బిస్తే బిగ్ బాస్ హీరో… లేదంటే వెధవ” నాగార్జునపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు